వంద మంచి పుస్తకాలు

నేను చదివిన పుస్తకాలలో నాకు నచ్చినవి, చదవడం వలన నాకు తృప్తినిచ్చినవి అయిన పుస్తకాలను జ్ఞాపకం చేసుకుంటూ ఒక list రాయగా అవి సుమారు ఒక వంద దాకా వచ్చాయి. నా personal library చూసి రాస్తే ఈ సంఖ్య మరికొంత పెరిగేదేమో. ఇందులో మొదట పేర్కొన్న కొన్ని గ్రంథాలు మాత్రం Highly recommended. ప్రతి ఒక్కరూ తప్పక చదవవలసిన పుస్తకాలవి.

నేను ఈ బ్లాగులో ‘మంచి పుస్తకం’ శీర్షికతో నేను చదివిన వాటిలో కొన్ని మంచి పుస్తకాలను పరిచయం చేశాను. ఆ పని నా మిగతా ప్రోజెక్టులలాగే తాత్కాలికంగా ఆగిపోయింది. ఆ పని తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తానో, ఆ శీర్షిక ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేను. అందాకా ఈ లిస్ట్ చూడండి. నేను ఎప్పటికి పరిచయం చేసినా కూడా అవి దాదాపూ ఈ పట్టికలోనివి మాత్రమే అయి ఉంటాయి.

1.భగవద్గీత-శిష్ట్లా సుబ్బారావు వ్యాఖ్యానం

2.భారతజాతికి నా హితవు-స్వామి వివేకానంద

3.Glimpses of World History- Jawaharlal Nehru

4.ఆత్మకథ-మహాత్మా గాంధి

5.యం.యన్.రాయ్ స్వీయగాథలు

6.ఆత్మవికాసము (self unfoldment)-స్వామి చిన్మయానంద

7.The Prince- Machiavelli

8.Letters to His Son-Lord Chesterfield

9.The 48 Laws of Power-Robert Greene

10.The Art of Seduction-Robert Greene

11.The 33 Strategies of War-Robert Greene

12. The Art of Love-Ovid

13.The Art of War-Sun-Tzu

14. రాజయోగం-స్వామి వివేకానంద

15.శ్రీమదాంధ్ర మహాభారతం-పిలకా గణపతి శాస్త్రి

16.స్తోత్ర రత్నావళి-వివిధ దేవతా స్తోత్రాల సంకలనం

17.చలం-బిడ్డల శిక్షణ

18.భర్తృహరి సుభాషితాలు-ఏనుగు లక్ష్మణకవి (అనువాదం)

19.గీతగోవిందం-భక్త జయదేవుడు

20.శ్రీమద్భాగవతం-భక్త పోతన

21. భారతజాతీయ పునరుజ్జీవనం

22.వీరభారతం-పురిపండ అప్పలస్వామి (1857 తిరుగుబాటు)

23.మన చరిత్ర- ఏటుకూరి బలరామమూర్తి

24.ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర-ఏటుకూరి బలరామమూర్తి

25.భారతీయ సంస్కృతి– ఏటుకూరి బలరామమూర్తి

26.ఉపనిషత్ చింతన-ఏటుకూరి బలరామమూర్తి

27.సాధన రహస్యం-అనుభవానంద స్వామి

28.రాహుల్ సాంకృత్యాయన్ జీవిత చరిత్ర-ఓబుల్ రెడ్డి

29.విశ్వదర్శనం-నండూరి రామమోహనరావు (ప్రాచ్య, పాశ్చాత్య తత్త్వశాస్త్రాల పరిచయం)

30.స్వీయచరిత్రము-కందుకూరి వీరేశలింగం

31.కన్యాశుల్కం-గురజాడ అప్పారావు

32.లెనిన్ జీవిత చరిత్ర-మరియా ప్రిలెజాయెవ

33.విప్లవపథంలో నా పయనం-పుచ్చలపల్లి సుందరయ్య

34.వీర తెలంగాణ-రావినారాయణ రెడ్డి

35. కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక-మార్క్స్ మరియు ఎంగెల్స్

36. రాజ్యం-విప్లవం-లెనిన్

37.The Great Road-Agnes Smidely (చైనా నాయకుడు జనరల్ ఛూటే జీవిత చరిత్ర)

38.Red Star Over China-Edgar Sno

39.అమ్మ-మాక్సిం గోర్కి

40.అసమర్థుని జీవయాత్ర-త్రిపురనేని గోపీచంద్

41.చివరికి మిగిలేది-బుచ్చిబాబు

42.ప్రాంచీల బూచి ‘బుస్సీ’-పులిచెర్ల సుబ్బారావు (ఫ్రెంచి సేనాని బుస్సీ చరిత్ర)

43.భారతదేశ స్వాతంత్ర్య సమరం-బిపిన్ చంద్ర

44.ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర-రఘునాథరావు

45.ఆధునిక ప్రపంచ చరిత్ర-తెలుగు అకాడమి (B.A.,పాఠ్య గ్రంథం)

46.ఆధునిక భారతదేశ చరిత్ర-HBT ప్రచురణలు

47.మధ్యయుగ భారతదేశ చరిత్ర-తెలుగు అకాడెమి ప్రచురణ

48.ఏడుతరాలు-అలెక్స్ హేలీ

49.సత్యాన్వేషి చలం-వాడ్రేవు వీరలక్ష్మి దేవి

50.ప్రవహించే ఉత్తేజం-చెగువెరా జీవితచరిత్ర

51.మైదానం-చలం

52.జీవితాదర్శం-చలం

53.మ్యూజింగ్స్-చలం

54.స్త్రీ-చలం

55.చలం-చలం ఆత్మకథ

56.తారాపథం (ఆకాశంలో కనిపించే నక్షత్రాలు, రాశులు, గ్రహాల గురించి) – కొండముది హనుమంతరావు

57.జైభవానీ! జైశివాజీ! -పులిచెర్ల సుబ్బారావు (ఛత్రపతి శివాజి చరిత్ర)

58.సైతాన్ కా బచ్చా!-పులిచెర్ల సుబ్బారావు (మొఘల్ రాజ కుటుంబం యెడల గులాంఖాదిర్ అకృత్యాలు)

59.ఓల్గా సే గంగా-రాహుల్ సాంకృత్యాయన్

60.లోకసంచార శాస్త్రం-రాహుల్ సాంకృత్యాయన్

61.పురిపండా భారతం-పురిపండ అప్పలస్వామి

62.పురిపండ రామాయణం- పురిపండ అప్పలస్వామి

63.పురిపండ భాగవతం- పురిపండ అప్పలస్వామి

64. వాత్సాయన కామసూత్రాలు

65.You Can Win-Shiv Khera

66.The Magic of Thinking Big

67.The Monk Who Sold His Ferrari-Robin Sharma

68.Mega Living-Robin Sharma

69.Who Moved My Cheese

70.Stop Worrying and Start Living-Dale Carnegie

71.How to Win Friends and Influence People- Dale Carnegie

72. Chicken Soup for The Soul

73.నేను-నాదేశం-దర్శి చెంచయ్య (గదర్ పార్టీలోని ఏకైక దక్షిణభారతీయుడు)

74.మహాప్రస్థానం-శ్రీశ్రీ

75.కృష్ణపక్షము-దేవులపల్లి కృష్ణశాస్త్రి

76.ఎంకిపాటలు-నండూరి సుబ్బారావు

77.శ్రీనాథుని చాటువులు-పోలవరపు కోటేశ్వరరావు సంకలనం

78.విజయనగరపతనం-ప్రసాద్

79.ఖారవేలుడు (ప్రాచీన కళింగ రాజు)

80.పుష్యమిత్ర

81.ఆర్య చాణక్య-ప్రసాద్

82.యుగంధర (కాకతీయ ప్రతాపరుద్రుని మంత్రి)-ప్రసాద్

83.సిరాజుద్దౌలా-ప్రసాద్

85. తెలంగాణా సాయుధ పోరాటం-ఆరుట్ల రామచంద్రా రెడ్డి

86.హెడ్గేవార్ జీవిత చరిత్ర (ఆర్.యస్.యస్.స్థాపకుడు)

87.స్వామి వివేకానంద జీవితచరిత్ర-రామకృష్ణ మఠం ప్రచురణ

88.తెలుగు సామెతలు

89.బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆత్మకథ

90.గారీబాల్డి జీవిత చరిత్ర (ఇటలీ స్వాతంత్ర సమరయోధుడు)

91.తపోవన స్వామి ఆత్మకథ (స్వామి చిన్మయానంద గురువు)

92.సక్సెస్ మేనేజ్‌మెంట్-కంఠంనేని రాథాకృష్ణమూర్తి

93.రాళ్ళు-రప్పలు-తాపీ ధర్మారావు ఆత్మకథ

94.దేవాలయాలమీద బూతుబొమ్మలెందుకు?-తాపీధర్మారావు

95.విజయవిలాసం-తాపీవారి వ్యాఖ్య

96.మహాభగవద్గీత-ఏర్పేడు ఆశ్రమ ప్రచరణ

97.గీతామకరందం-స్వామి విద్యాప్రకాశానంద గిరి

98.మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు-యస్.బి.రఘునాథాచార్య

99.శ్రీమద్భగవద్గీత-రావుల సూర్యనారాయణ మూర్తి

100. పాంచజన్యం-మాధవ సదాశివ గోల్వల్కర్ (బైబిల్ ఆఫ్ ఆర్.యస్.యస్.)

 

మరికొన్ని.……………

101.ఈశావాస్య ఉపన్యాసములు-పండిత గోపదేవ్ శాస్త్రి

102.కాసనోవా మెమోరీస్-కాసనోవా

103.గ్రామీణ పేదలకు–లెనిన్

104.ఏమి చేయాలి?–లెనిన్

105.మొదటి ఎత్తు–చెస్ ఆట పరిచయ గ్రంథం

106.The Art of Worldly Wisdom-Baltasar Gracian

107.ఆనంద మఠం–బంకించంద్ర ఛటర్జీ

108.భారతదేశంలో ఆంగ్లేయులు–ద్రవిడ విశ్వవిద్యాలయం వారి ప్రచురణ

4 వ్యాఖ్యలు

  1. Lakshmi said,

    ఆగస్ట్ 25, 2010 వద్ద 10:50 ఉద.

    hi,
    I want to know where can i buy these books. Unless that info just reading titles will not serve the purpose.

    Thanks,
    Lakshmi
    http://my-thoughts-clouds.blogspot.com/

  2. saraswathikumar said,

    ఆగస్ట్ 26, 2010 వద్ద 7:55 ఉద.

    లక్ష్మి గారూ! నేను మంచి పుస్తకం శీర్షికతో ఇప్పటికే ఈ బ్లాగులో కొన్ని పుస్తకాలను పరిచయం చేశాను. ఆ పరిచయాలలో వాటి లభ్యత గురించి, వాటి ధర గురించి వివరాలను కూడా పేర్కొన్నాను. నేను చదివిన పుస్తకాలలో చాలా వరకూ నేను కొనే చదివాను. వాటిలో ఇప్పటికీ మార్కెట్లో లభిస్తున్నవి కొన్ని ఉన్నాయి. కొన్ని ప్రస్తుతం దొరకక పోవచ్చు. అలాగే నేను పబ్లిక్ లైబ్రరీనుండి తెచ్చుకొని చదివిన పుస్తకాలు కూడా కొన్ని ఉన్నాయి. అయినప్పటికీ సాధ్యమైనంతవరకూ నేను ఎక్కడినుండి ఈ పుస్తకాలలో చాలా వాటిని కొన్నానో చెబుతాను. నేను గుంటూరు, విజయవాడలలోని విశాలాంధ్ర బుక్ స్టాల్ కు తరచు వెళ్తుంటాను. అక్కడనే నేను అనేక పుస్తకాలు కొన్నాను. మీ ప్రాంతంలో అనంతపురం, తిరుపతి లాంటి చోట్ల విశాలాంధ్ర ఉన్నది. ఇక విజయవాడలో ప్రతి సంవత్సరం జనవరి నెలలొ జరిగే పుస్తక మహోత్సవాన్ని నేను చాలా సంవత్సరాలు రెగ్యులర్‌గా సందర్శించాను. ఆ సమయంలో కూడా చాలా పుస్తకాలు కొన్నాను.

    ఇక రచయితల పరంగా ఏటుకూరి బలరామమూర్తి గారి పుస్తకాలు విశాలాంధ్రలో ఎల్లప్పుడూ దొరుకుతాయి. పులిచర్ల సుబ్బారావు గారి పుస్తకలు కేవలం ‘విశ్వ హిందూ పరిషత్ ‘ పుస్తకాలమ్మే ‘సాహిత్యానికేతన్ ‘ లోనే దొరుకుతాయి.ఇది హైదరాబాదు బర్కత్ పురాలో ఉన్నది, విజయవాడలో ఏలూరు రోడ్ లో ఉన్నది. చలం గారి రచనలు విశాలాంధ్రలో ఎల్లవేళలా దొరుకుతాయి.

    గీతా ప్రెస్స్ పుస్తకాలకు తిరుమలలో మరియు సికింద్రాబాదు రైల్వే ప్లాట్ ఫాం (1 వ నంబరు )లో వారి స్టాల్స్ ఉన్నాయి. రామకృష్ణ మఠం పుస్తకాలకు హైదరాబాదు దోమల్ గూడా లో వారి మఠ విక్రయశాల ఉన్నది. అలాగే తిరుమలలో, విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లలో వారి స్టాల్స్ ఉన్నాయి. అలాగే రాజమండ్రి, వైజాగ్ లలో వారి మఠాలున్నాయి. వాటిలో దొరుకుతాయి. ఒకోసారి విశాలాంధ్రలో కూడా దొరుకుతాయి. TTD ప్రచురణలు తిరుమలలో దొరుకుతాయి. అలాగే అనేక పట్టణాలలో కల వారి కళ్యాణమండపాలలో కూడా దొరుకుతాయి. చిన్మయ గ్రంథాలు మీ ప్రొద్దుటూరులోనే దొరుకుతాయి. లేదంటే హైదరాబాదు బేగంపేటలో చిన్మయ మిషన్ ఉన్నది.

    ఇంకా ప్రత్యేకించి మీకే పుస్తకం గురించి సమాచారం కావాలన్న నిస్సంకోచంగా అడగవచ్చు.

  3. ravi prakash said,

    మే 6, 2011 వద్ద 2:18 సా.

    Please check on this site… it may be useful to you
    http://www.avkf.org

  4. pln acharyulu said,

    అక్టోబర్ 13, 2013 వద్ద 1:23 సా.

    thank u for giving a such list


వ్యాఖ్యానించండి