మంచి పుస్తకం-Power, Seduction and War (by Robert Greene)

సాధారణంగా ‘లౌక్యం, వ్యవహార దక్షత లాంటి విషయాలనూ, ఎత్తుకు పై ఎత్తు వేసే నైపుణ్యం, వ్యూహ ప్రతివ్యూహాలను పన్నే చాణక్యం.. వంటి విషయాలనూ మాటలలో వివరించడం సాధ్యంకాదు. వాటిని స్వయంగా, అనుభవపూర్వకంగా ఎవరికివారు తెలుసుకోవలసినదే’ అనే అభిప్రాయం ఉన్నది. కానీ రాబర్ట్ గ్రీన్ (Robert Greene) అనే అమెరికన్ రచయిత చాలా నేర్పుగా, అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లుగా ఆ పరిజ్ఞాన్నంతా మనకు బోధించాడు. Power, Seduction, War అంటూ ఈయన ఆ పరిజ్ఞానాన్నంతా మూడు విభాగాలుగా చేశాడు. ఒక్కొక విభాగానికి ఒక్కొక గ్రంథం చొప్పున మూడు గ్రంథాలు రచించాడు.

మొదటి విభాగమైన Power గురించి వివరించడానికి The 48 Laws of Power అనే గ్రంథం రాశాడు. మనం ఎదుటివారి మీద upper hand సాధించడానికి ఏ విధమైన లక్షణాలను కలిగి ఉండాలి, ఏవిధంగా వ్యవహరించాలి  అనే విషయాలను మొత్తం 48 సూత్రాల రూపంలో పొందుపరస్తూ ఈ పుస్తకం రాశాడు. ఈ పుస్తకం యొక్క సారాంశాన్ని అంటే ఈ 48 సూత్రాల యొక్క వివరణనూ క్లుప్తంగా నేను నా సుధర్మ బ్లాగులో అందించాను. (ఒక్కొక సూత్రానికి ఒక టపా చొప్పున)

రెండవ గ్రంథం  The Art of Seduction. ‘వశీకరణం’- అంటే ఎదుటిమనిషిని లోబరచుకోవడం- గురించి దీనిలో చర్చించాడు. Sex, Wealth, Power or Favor.. ఇలాంటి వాటిని ఎదుటివారి నుండి పొందటం కొరకు ఏ విధమైన పద్దతులను అవలంబించాలో, ఎలా ప్రవర్తించాలో ఇందులో విపులంగా వివరించాడు.

ఇక మూడవ గ్రంథం The 33 Strategies of War . మన ప్రత్యర్థిని అమాయకుడిగా, మన victim గా భావిస్తూ The 48 Laws of Power ను రూపొందించడం జరిగినది. కానీ మన ప్రత్యర్థి మనలాగే Power Player అయిన పక్షంలో అతని మీద మనం ఏ విధంగా upper hand సాధించాలి అనే దాన్ని వివరించడానికి ఈ The 33 Strategies of War  అనే గ్రంథం రాశాడు.

ఈ మూడు గ్రంథాలూ సాధారణమైన వ్యక్తిత్వ వికాస గ్రంథాల్లా ఉండవు. పాజిటివ్ యాటిట్యూడ్, టైం మేనేజ్‌మెంట్, గోల్ సెట్టింగ్ ..ఇలా ఉండదు వివరణ. చరిత్రలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించబడిన నియమాలు, సూత్రాలతో (Laws and Principles) వివరణ అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. These all principles are timeless and ruthless.

ఇవి శ్రీరంగ నీతులు అసలేకావు. పైగా అందుకు విరుద్ధమైనవి. సాధారణంగా మంచితనం, మానవత్వం, నిజాయితీ, మర్యాద-మన్నన, సత్యవాక్పరిపాలన, అపకారికి కూడా ఉపకారం చేయడం.. ఇలాంటి “సలక్షణాల”ను మనం ఉన్నత విలువలుగా భావిస్తుంటాం. కానీ ఈ గ్రంథాలు చదివిన తరువాత ఈ లక్షణాలన్నీ మనలను ఏ విధంగా బలహీనులుగా మారుస్తున్నాయో; మనలోని ఈ విధమైన లక్షణాలను ఆసరాగా చేసుకుని కొందరు ఏ విధంగా మన మీద పెత్తనం చెలాయిస్తున్నారో కొందరైతే మనలను ఏ విధంగా అణచివేతకు గురిచేస్తున్నారో, ఏ విధంగా మన వినాశనానికి కారణమౌతున్నారో మనకు బోధపడుతుంది.

రచయిత మనకు బోధించే విషయాలు ఒక్కోసారి కుట్రలు, కుతంత్రాల రూపంలో ఉంటాయి. కానీ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. మనం ఉన్నత విలువలు అని వేటినైతే భావిస్తున్నామో అవి నిస్సందేహంగా ఉన్నతమైనవే. కానీ అవి సత్తెకాలంలో మాత్రమే ఆచరించదగినవి. కుట్రపూరితమైన నేటి కాలంలో అవి మనలను బలి పశువులుగా మార్చడానికి తప్ప దేనికీ పనికిరావు. శ్రీరంగనీతుల నుండి ఒక్కక్షణం బయటపడి వాస్తవికతతో ఆలోచిస్తే మనకు బోధపడే విషయం ఇదే. ముఖ్యంగా సత్తెకాలపు శ్రీరంగనీతులు ఉన్నత విలువలుగా భావించబడే భారతదేశంలో ఈ గ్రంథాల పఠనం అత్యంత ఆవశ్యకం.

గుంటనక్కలు, తోడేళ్ళు సంచరించే ఈ లోకంలో మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఇటువంటి మర్మాలేవీ తెలియకుండా అంతా భగవంతుడే చూసుకుంటాడనుకునే భక్తితత్త్వ ధోరణితో అమాయకంగా ఉంటే మంచివాళ్ళం, గంగిగోవులం  అనిపించుకుంటామేమోగానీ ఆ మోసాలు, కుట్రలు, కుతంత్రాలు చేసేవారికి మనం బలైపోకుండా మనలను ఆ భగవంతుడుకూడా రక్షించలేడు.

The Art of Seduction గ్రంథంలో సాధారణ సభ్య సమాజం అంగీకరించని ఎత్తుగడలను రచయిత చాలా వాటినే వివరిస్తాడు. అయితే మనం ఈ విషయాలన్నింటినీ తెలుసుకునేది వాటిద్వారా అమాయకులను బలితీసుకోవాలని కాదు. స్వయంగా మనం ఈ గుంటనక్కలు, తోడేళ్ళ బారిన పడి బలై పోకుండా డిఫెన్స్ చేసుకోవడం కోసం మాత్రమే. అందుకొరకైనా మనం వాటి గురించిన పరిజ్ఞానం పొందాలి. మనకు ఇంకా అవకాశం ఉంటే మనలను మనం రక్షించుకోవడమే కాకుండా అమాయకులెవరైనా ఈ తోడేళ్ళబారిన పడకుండా రక్షించనూవచ్చు. ఆ విధంగా మనం హీరోగా కూడా మారవచ్చు. అంటే ‘హీరో’ అవాలంటే ముందుగా ‘విలనీ’ ని అధ్యయనం చేయాలి. లేదంటే ఎవరో ఓ విలన్‌కు బలైపోయి మనలను రక్షించే హీరో కోసం ఎదురుచూసే అమాయక, అనామక victim గా మిగిలిపోక తప్పదు.

ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ మూడు పుస్తకాలనూ కూడా రచయిత కొన్ని సూత్రాల లేక నియమాల (Laws and Principles) విపులీకరణ  రూపంలో రచించాడు. ఆ నియమాలన్నింటినీ సాధారణ చరిత్ర గ్రంథాలలో లభ్యంకాని అనేక సూక్ష్మ చారిత్రక ఘటనల ద్వారా వివరిస్తూ, అనేక మంది చారిత్రక వ్యక్తులను పరిచయంచేస్తూ, వారి గుణగణాలనూ, వారి వ్యూహ ప్రతివ్యూహాలనూ, ఎత్తుగడలనూ, వారు జీవితంలో సాధించిన విజయాలనూ, పొందిన వైఫల్యాలనూ, వాటికి కారణాలనూ అత్యంత ఆసక్తికరంగా విపులీకరించాడు.

ఒక్కొక్క పుస్తకం షుమారు 450 పేజీలు ఉంటుంది. ఒక్కొక్క దాని ఖరీదు షుమారు Rs.400/- ఉంటుంది. The 48 Laws of Power కు, The Art of Seduction కు concise editions కూడా ఉన్నాయి. వాటి ఖరీదు ఒక్కొక్కటి Rs.125/-

నాకు తెలిసినంతవరకూ ఈ గ్రంథాలకు పైరేటెడ్ కాపీలు లేవు. కనుక పుస్తకాలు కారు చవకగా దొరికే మన అబిడ్స్ సండే మార్కెట్లో ఇవి దొరకక పోవచ్చు. హైదరాబాద్‌లో అయితే హిమాలయా బుక్ షాప్ వంటి చోట్ల దొరుకుతాయి. వైజాగ్ లో అయితే పేజెస్, జ్యోతి, గుప్తా బ్రదర్స్, బుక్ సెంటర్, వాగ్దేవి లాంటి చోట్ల దొరుకుతాయి. ఇవి విశాలాంధ్రలో కూడా దొరుకుతున్నాయి.

ఈ గ్రంథాలను చదవడం ద్వారా తెలుసుకున్న విషయాలతో పోలిస్తే వీటిని కొనడానికి మనం పెట్టిన డబ్బు, చదవడానికి మనం పడిన శ్రమ, కేటాయించిన సమయం చాలా స్వల్పమే అని గ్రహిస్తారు. ఈ పుస్తకాలను చదివిన తరువాత మీరు ఒక చాణక్యుడు, ఒక మాకియవెల్లి, ఒక sun-tzu అయిపోతారంటే నమ్మండి. :b.

మొదటి రెండు గ్రంథాల (PDF) eBooks ను esnips.com నుండి ఉచితంగా పొందవచ్చు.

ప్రకటనలు

12 వ్యాఖ్యలు

 1. Sree said,

  జనవరి 12, 2009 వద్ద 8:46 ఉద.

  Thanks for your kind review of these books, I just got curious about these books with your review and started downloading the Audio books of these so that I can listen to them in my car.
  I will add another comment about my opinion later once I listen to these books.
  A Good reader will not just read and stop, but encourage the others to read and explore.. you are such one..
  Thanks again.. keep helping us to know about more good books.
  -Sree

 2. saraswathikumar said,

  జనవరి 12, 2009 వద్ద 12:02 సా.

  Sure! Thank you for your appreciation!

 3. Sree said,

  జనవరి 17, 2009 వద్ద 4:53 ఉద.

  Downloaded the Audio book, reached up to Rule 20, going well.
  The only down side of this book is the illustrations are from the very olden history pages. Which needs more then once to read/listen. But this is a small issue, the content is real nice.
  On the other hand, I would like to appreciate you for blogging each rule neatly in Telugu as well.
  Good work,
  Thanks again,
  Sree

 4. జనవరి 17, 2009 వద్ద 11:44 ఉద.

  Carry on! Thank you!

 5. అరుణం said,

  జనవరి 28, 2009 వద్ద 6:57 సా.

  I read your blog. This book is not useful for Indians because they started practising all the Strategies mentioned by the author long time ago. Only thing is that they did not categorise like the way Robert mentioned in the book. We did not develop because most of the Indians implemented these rules on the name of caste, religion, language etc., finally it lead us not beliving any Indian and past several centuries we started working for outsiders . I request you to remove this book from this blog because this book is not for all. Hope you will take my feedback positively.

 6. subash said,

  మే 19, 2010 వద్ద 10:03 ఉద.

  hi why dont you write about The art of seduction in telugu, i read 48 laws in telugu in your blog, its so nice. if possible pls write in telugu also
  Thank you

  • saraswathikumar said,

   మే 31, 2010 వద్ద 6:05 ఉద.

   Hello! Subash! ThanQ for your comment and appreciation. I will surely write ‘The art of Seduction’ also briefly in Telugu. But I can’t tell when I will do it, because for the time being, I am working in my spare time if any to translate Machiyavelli’s ‘The Prince’ in to our beloved Telugu–bye

 7. madhu babu said,

  ఏప్రిల్ 30, 2011 వద్ద 5:32 ఉద.

  I read your blog, its not too good or not bad,keep it up

 8. Arjun said,

  ఫిబ్రవరి 27, 2012 వద్ద 8:57 ఉద.

  Many many thanks for this blog.

 9. ashok said,

  జూన్ 17, 2014 వద్ద 1:51 సా.

  I feel very much pleasure while reading 48 laws in telugu. thank you

 10. pavan said,

  అక్టోబర్ 22, 2014 వద్ద 12:32 సా.

  సరదాగా అంటున్నాను.. సీరియస్ గా అడుగుతున్నాను.
  ఇలా ఈ రహస్యాలు అందరితో పంచేసుకోవడం ద్వారా మీకు మాత్రమే తెలిస్తే ఉండే అడ్వాంటేజ్ కోల్పోవట్లేదా? అలా చేయవద్దని ఆ మూడు పుస్తకాలలోనూ ఎక్కడా రాసిలేదా?
  మాతో పంచుకున్నందుకు హేపీనే కానీ చిన్న క్యూరియాసిటీ అంతే.

 11. Saraswathi Kumar said,

  అక్టోబర్ 26, 2014 వద్ద 3:24 ఉద.

  @pavan ఇవి నాకు సహజసిద్ధంగా తెలిసినవే ఐనట్లైతే బహుశా నేనూ ఎవరితో పంచుకునేవాడ్నికాదేమో! కానీ నేను అంత మాయగాడిని కాదు. పైగా వీటిలో కొన్నింటికి నేను బాధితుడిని. అందుకే నా లాంటి వారు కొందరికైనా ఉపయోగంగా ఉంటుందని వీటిని నేను తెలుగులో రాశాను. ఇక ఆ పుస్తకాలు రాసిన వాని ఉద్దేశ్యం కూడా తెలియని వారికి తెలియజెప్పటమే. మాయగాళ్ళకు వీటిగురించి పుస్తకాలు రాసి మరీ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకా జిత్తులమారి బుద్ధి సహజంగానే ఉంటుంది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: