మంచి పుస్తకం-సాధన రహస్యము (అనుభవానంద స్వామి)

భారత దేశపు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిన్న వయసులోఉన్న తన కుమార్తెకు జైలు నుండి అనేక ఉత్తరాల ద్వారా  ప్రపంచ చరిత్రను పరిచయం చేశాడు. ఆ ఉత్తరాలన్నీ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పేరుతో ఒక గ్రంథంగా ప్రచురింపబడ్డాయి. ఇది ఆంగ్ల సాహిత్యం లో ఒక గొప్ప గ్రంథంగా పరిగణింపబడుతున్నది. అలాగే మన తెలుగు సాహిత్యంలో కూడా ఇటువంటి గ్రంథమే ఒకటి ఉన్నది. అనుభవానంద స్వామి (1908-73) పిన్న వయసులో ఉన్న తన శిష్యురాలు మాతాజీ త్యాగీశానంద పురీ కి ఆథ్యాత్మిక మరియు సాధనా సంబంధమైన విషయాలను తెలియజేయటానికి 1946 లో అనేక ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలన్నీ సాధన రహస్యము అనే గ్రంథంగా ప్రచురింప బడ్డాయి.

అనుభవానంద స్వామి 1908 లో గుంటూరు జిల్లా అమృతలూరులో జన్మించారు. ఈయన ఉన్నత విద్యాభ్యాసం చేసిన మేధావి. బహుముఖ ప్రజ్ఞావంతుడు. రచనలే కాక కవిత్వం, చిత్రకళ, వడ్రంగం, శిల్పం, సంగీతం ఇత్యాది వాటన్నింటిలో ప్రవేశమేకాక ప్రావీణ్యత కూడా ఉన్నది. కళాశాలలో చదివే రోజులలో అనేక బంగారు పతకాలు కూడా సాధించాడు. ఈయన సృష్టించిన కళా ఖండాలు నేటికీ పదిలంగా ఉన్నాయి. ఈయన భారత దేశమంతటా పర్యటించిన పరివ్రాజకుడు. సుధీర్ఘ కాలం అనేక కఠిన సాధనలు చేసిన సాధకుడు. మంచి వక్త. ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కలిగిన వాడు.

ఈయన రామకృష్ణ పరమహంస చూపిన  మార్గంలో సన్యసించి తన  జీవితాన్ని కొనసాగించాడు. ఈయన ప్రాచీన భారతీయ సాహిత్యాన్ని అంటే వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, దర్శనాలు మొదలైన వాటన్నింటినీ మధించి వాటిని ప్రజలకు సుబోధకంచేస్తూ విస్తృతమైన  సాహిత్యాన్ని సృజించాడు. తన సాహిత్యాన్ని అనుభవానంద గ్రంథ మాల ద్వారా ప్రజలకు అందించాడు. బాపట్ల మరియు భీమునిపట్నంలలో ఈయన ఆశ్రమాలను నెలకొల్పాడు.

ఈయన రచనలలో ప్రధానమైనది  భారతీయ ఆథ్యాత్మిక విజ్ఞానానికి ఎన్ సైక్లోపీడియా అనదగిన సర్వసిధ్దాంత సౌరభం అనే గ్రంథం. ఈ  గ్రంథాన్ని ఈయన 12 సంపుటాలలో రచించారు. ఇందులో షడ్దర్శనాలనూ మరియూ అద్వైతం, విశిష్టాద్వైతం, వైష్ణవం, శైవం, శాక్తేయం, బౌధ్దం మొదలైన అన్ని సిధ్దాంతాలనూ విస్తృతంగా చర్చించారు. ఐతే ఈ గ్రంథం పండిత స్థాయిలో ఉంటుంది. కానీ మనం ప్రస్తుతం తెలుసుకుంటున్న సాధన రహస్యం అనే గ్రంథం మాత్రం సామాన్య పాఠకులందరికీ అర్థమయ్యేటట్లుగా ఉంటుంది.

తన శిష్యురాలికోసం రాసిన ఈ ఉత్తరాలలో అనుభవానంద స్వామి చాలా సులువైన వ్యావహారిక భాషను ప్రయోగించారు. ఆవిడ చిన్న వయసులో ఉన్నపుడు, సాధనా మార్గంలోకి రాకపూర్వం ఆవిడకు ఆథ్యాత్మిక సాధనా సంబంధమైన విషయాలను పరిచయం చేయటానికి ఈ ఉత్తరాలు ఉద్దేశింపబడినవి కనుక వీటిలో ఆయన సులభమైన శైలిని ఉపయోగించారు. ఈ కారణం చేతనే సాధారణ పాఠక లోకంలో ఈ గ్రంథం చాలా ప్రాచుర్యం పొందినది.

ఈ గ్రంథంలో అనుభవానంద స్వామి కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాలతోపాటు వివేక వైరాగ్యాది సాధనా చతుష్టయాన్ని గురించి పామరులకు సైతం అర్థమయ్యే విధంగా విపులంగా చర్చించారు. ఈ గ్రంథం అనేక భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్ లాంటి పాశ్చాత్య  భాషలలోకి కూడా అనువదింపబడింది. భారతీయ ఆథ్యాత్మిక విషయాలలోని అర్థంకాని సంక్లిష్ట విషయాల జోలికి పోకుండా ఒక సాధారణ వ్యక్తికి ఆయా విషయాల యొక్క ప్రథమ పరిచయానికి తగినట్లుగా ఈ గ్రంథం వ్రాయబడినది కనుక ఇది ప్రతి ఒక్కరూ చదువదగిన గ్రంథం.

స్వామి అనుభవానంద యోగ కేంద్ర, భీమునిపట్నం-522163, విశాఖపట్నం జిల్లా ను గానీ లేక శ్రీ అనుభవానంద గ్రంథమాల, యం.జి.రోడ్,బాపట్ల-522 101,గుంటూరు జిల్లా ను గానీ సంప్రదించి  ఈ పుస్తకాన్ని పొందవచ్చు. సాహిత్యానికేతన్ లాంటి హిందూ మత సాహిత్యం దొరికే బుక్ స్టాల్స్ లో కూడా ఈ గ్రంథం దొరుకుతుంది.

 

ఈ గ్రంథాన్ని ఇక్కడనుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి లేదా ఆన్‌లైన్లో చదువుకోండి

 

ప్రకటనలు

7 వ్యాఖ్యలు

 1. అబ్రకదబ్ర said,

  మే 22, 2008 వద్ద 10:17 సా.

  మంచి పుస్తకాలను పరిచయం చేస్తున్నారు. ధన్యవాదాలు.

 2. rathnamsjcc said,

  మార్చి 11, 2011 వద్ద 8:17 ఉద.

  (దేహమును వదిలే)ఆత్మ ఒక్క క్షణం అంతటా వ్యాపించి వుంది చైతన్యశక్తి కంటికి కనపడనదిసూక్ష్మ చైతన్య ఆకాశములోకి వెళ్లి సత్యమని నమ్మర
  జీవో బ్రహ్మైవ నాపర:యని తెలియర మనస్సునిలుకడ చెందర ఆత్మనిజస్థితిని తెలియర చింతలులేని ఇల్లు శివాలయంబుర
  కోర్కెలుడిగిన హృదయం కోవెలయని తెలియరఒక్క మాటలో చెప్పబడే “మనసు”లో అనేక భాగాలున్నాయి: మనస్సు; బుద్ధి; చిత్తం; హృదయం; అహంకారం. వీటన్నిటి కలగలుపే “మనస్సు”. కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని పనిచేయించేదీ, అదుపులో పెట్టేదీ ఈ మనసే; కష్టాల్ని, బాధల్ని అనుభవించేదీ మనసే; సుఖాల్ని, ఆనందాన్ని అనుభవించేదీ మనసే; కృంగిపోయేదీ మనసే; పొంగిపోయేదీ మనసే. మనసుకి ఎందుకీ వైవిధ్యం? మనస్సు నిశ్చలంగా, స్థిరంగా మనస్సునిలుకడ తెలియర, మనస్సు ఒకే విషయమందు లగ్నమై వుంటుంది. ఇక్కడ ఆలోచనలకు తావులేదు. స్థితి అయిన సమాధి స్థితిలో ఆలోచనలు వుండవు; స్పృహ వుండదు; మనస్సు నిశ్చలమై వుంటుంది; సమయం తెలియదు. ఇక్కడే సత్యాన్ని లేదా సత్య-స్థితిని పొందవచ్చు,మనస్సు ఆలోచనల స్థితిని దాటినప్పుడే బ్రహ్మo సత్యం తెలుస్తుంది ఈ సమాధి స్థితిలోకి వెళ్ళిన తరువాతే సత్యాన్ని తెలుసుకోవటం జరుగవచ్చుసమాధి స్థితి సత్యాన్ని గురించి ఎవరూ, ఎవరికీ బోధించలేరు

 3. rathnamsjcc said,

  మార్చి 11, 2011 వద్ద 8:21 ఉద.

  ఈ. మనస్సును యొక్కజన్మస్ధానం, నిజమైన నేను నిర్విరామంగ స్వయంప్రకాశమై తేజరిల్లుతుంది. సమస్త ముక్తి మార్గములకు నిలయమిది. నిజమైన నేనే దైవం. ప్రతి నేను దైవ నేను గ్రహించవలయునుశివకేశవుల అనంత చైతన్య ఏకత్వాన్నో ద్వైతాన్నో అద్వైతాన్నో చెప్పేసారు. ఈ ఆత్మ స్ధితి ఉపదేశము. తన సహజ స్ధితియైనఎరుక చైతన్యం నుండి విడిపోకుండ చూడటమే ఉపదేశ రహస్యము. నీవు సదా ఆత్మవే! ఆత్మకంటె భిన్నమైన వాడవుకావు. ఆత్మయే నీవని నిరూపించటమే గురూపదేశం ఆత్మ లో ఎరుక చైతన్యం దేవుడు ఒక్కడే చైతన్యం బ్రహ్మరహస్యం ఎరింగిన వారందరూ ఎరుక చైతన్యం సూక్ష్మమౌనము క్షయే ఔచ్చుకొటారు. అది పరివక్వత చెందిన స్ధితి. చైతన్యం నుండి ఎరుక అనుభవాన్నిపోందుతున్నాం ఎరుక తొ మనం సూక్ష్మ చైతన్యం అనుభవాన్ని పోందె అవకాశం ఒక్కఎరుక చైతన్యంసూక్ష్మ స్థితిలొ మాత్రమే జరుగుతుంది. శరీరంలొ చైతన్యం సూక్ష్మ సకల చరాచర జీవ సమూహమును అనే తార తమ్యం లోకుండా మాతలను, సమస్త దైవావ తారముల ఎరుక చైతన్యం ఏకావస్ధలో, ఎరుక చైతన్యం సూక్ష్మము ఏకాత్మస్ధితిలోఎరుక అనుభవాన్నిపోందుతున్నాం ఎరుకతొ మనం సూక్ష్మము అనుభవాన్ని పోందె అవకాశం

 4. rathnamsjcc said,

  అక్టోబర్ 21, 2011 వద్ద 4:08 ఉద.

  ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?పూర్వ జన్మ లలోని కర్మ వలన.కర్మ ఎందుకు జరుగుతుంది?రాగం (కోరిక) వలన.రాగాదులు ఎందుకు కలుగుతాయి?అభిమానం (నాది, కానాలి అనే భావం) వలన.అభిమానం ఎందుకు కలుగుతుంది?అవివేకం వలన.. కారణం ఉండదు.) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం.అనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి. . గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదో రోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామి రథ సేవలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉండదని విశ్వాసం.

  మన శరీరాన్ని పుట్టుకకు మూలము మన తల్లి, తండ్రి. మన జ్ఞానమునకు మూలము మన గురువు. వారి నానంద పరచుట మన కనీస ధర్మము. ఈ క్రింది శ్లోకమును నా అనువాద పద్యమును పరిశీలింపుడు. శత్రు మిత్రులు – స్వర్గ నరకాలు అన్నీ మనలోనే వున్నాయి:- మానవుడు యెంత గొప్పవాడయినను కామాది అరిషడ్వర్గాన్ని జయించకపోతే తన గొప్పతనమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. నరకమనేది ఎక్కడో లేదు. మానవునకు గల కోపమే యమ ధర్మ రాజు. అతనికుండే ఆశయే వైతరణీ నది. అతని విద్యయే అతని పాలిటి కామ ధేనువు. అతని సంతోషమే ఆనంద నందన వనము.

  గ్రహించ గలము కదా! ఇంకెందుకాలస్యం ? మనమూ యీ పైన చెప్పిన సల్లక్షణాల్ని పెంపొందించుకంటే సరిపోతుంది కదా ! ప్రయత్నిద్దామా?

  … మానవునకు సంతోషం అనేది ఒక గొప్ప వరం. ఐతే అన్ని విషయాల్లోనూ సంతోష పడడం మంచిదికాదు. అలాగే అన్ని విషయాల్లోనూ సంతోష పడకపోవడం కూడా మంచిది కాదు. ఐతే ఏ విషయాలలో సంతోషించాలి, ఏ విషయాలలో సతోషించడం తగదు అనేవిషయం ఇప్పుడు పరిశీలిద్దాం

  గురువు. ఉపదేశం .అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞాన0 దర్శనమయ్యింది

  అజ్ఞానంతో అంధకారంలో పడి కొట్టు మిట్టాడే వారికి. అహంకారం అనే చక్రంలో పడి గిర గిరా తిరిగే వారికి. “అతితీర్శతామ్ తమోంధమ్” గాఢమైన చీకటిలో ఆత్మేమిటో పరమాత్మేమిటో ఎందుకు మనం ఇక్కడికి వచ్చామో కూడా తెలుసుకోకుండా ఇందులోనే పడి కొట్టుకునే వారిని కూడా తరింపజేయటానికి వచ్చినటువంటి గురువు. ఉపదేశం గ్రంథం ఇది. రుచి ఉండి శ్రద్ధ ఉండి, జ్ఞానులని ఆశ్రయించి ప్రార్థన చేస్తే పెద్దలు చేసే ఉపదేశం తప్పకుండా తరింపజేస్తుంది. అందులో సందేహం లేదు అజ్ఞానులని కూడా జ్ఞానులుగా, భగవంతుని పరికరాలుగా తీర్చి దిద్దే మహోపదేశాన్ని గురువు. మనకి ఉపదేశించారు. గురువును మించిన దైవం మరొక్కటి లేదని, … ఈ మోక్షాన్ని కలిగించే మార్గాన్ని అనుసరించమని చేసిన ఉపదేశం ఆత్మ విషయంలో కానీ పరమాత్మ విషయంలో కానీ మనం చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉండటం అంటే ఏమిటంటే కన్ను ఉంటుంది, వస్తువు ఉంటుంది కానీ ఆకాన్ను వస్తువుని చూసే శక్తి చాలదు. మధ్యలో ఆవరించి ఉన్న చీకటిని తొలగించి కంటికి ఆ వస్తువుని కన్పింపజేసేట్టుగా మధ్యలో వెలుతురు కావాలి. వెలుతురునిచ్చే దీపం కావాలి. అనాదిగా అంటి పెట్టుకున్న కర్మ వాసనల దొంతరలు లెక్క లేనన్ని పేరుకొని ఉన్నాయి. మనలో జ్ఞానం సహజంగానే ఉంది కానీ , ఆ జ్ఞానాన్ని పైకి తెచ్చుకోవడానికి గురువులు తమ జ్ఞానాన్ని తోడుగా ఇచ్చి పైకి తెస్తారు. ఇదివరకు మనల్ని అడ్డే పొరలని దాటి వచ్చే శక్తిని గురువులు ఉపదేశం ద్వారా ఇస్తారు. వారి ఉపదేశం లోనికి వెళ్ళి క్రమేమి కర్మ వాసనలు తొలగుతాయి. “అధ్యాత్మ దీపమ్”, దీపం కొత్తగా వస్తువులని తెచ్చి చూపదు. వస్తువు అక్కడే ఉంటుంది కానీ దీపాన్ని వెలిగించి పెట్టుకుని ఉన్నంత వరకు ఆవస్తువుని కనిపించేట్టు చేస్తుంది. ఆత్మ స్వరూపాన్ని పరమాత్మ స్వరూప స్వభావాల్ని స్పష్ట పరిచే దీపాన్ని మహర్షి వెలిగించి పెట్టాడు,
  వేదముల సారాంశం. అది ఎంత గొప్పదైనా వేదాన్ని అనుసరించేదే కావాలి, అప్పుడే ప్రమాణయోగ్యం. అట్లాంటి దాన్నే ఉపదేశం చేసాడు. వేదం రెండు భాగాలు. పూర్వ భాగం మనం చేసే కర్మలని ప్రతిపాదిస్తుంటుంది. రెండవది మనకి ఆనందాన్ని కలిగించే బ్రహ్మ తత్వాన్ని తెలుపుతుంది. ఇవి రెండు ఒకటే శాస్త్రం. బ్రహ్మ అనేది తెలియాల్సిన తత్వం, అది తెలిసిన తర్వాత ఆ తత్వన్ని ఎట్లా పొందాలో తెలుపుతుంది రెండూ ఒకటే. కనుక ఆరాధన స్వరూపాన్ని ఒకటి ఆరాధ్య స్వరూపాన్ని ఒకటి తెలుపుతుంది. రెండు కలిపి అది వేదం. ఆధ్యాత్మికవాదులు లేకపోలేదు. అయితే సరియైన సంస్కృతి లేకనే హిందుత్వం అందించినటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మికవాదులు అక్కడ వెలుగులోనికి రాలేకపోయారు. మిగిలిన ప్రపంచ సంస్కృతులలో ఆధ్యాత్మికత ఎడారిలో ఎండమావిలాంటింది. హిందువు ఆధ్యాత్మికతనూ, సంస్కృతినీ వేరు చేయటం మానాలి. నిశితంగా గమనించి చూడండి. మన సంస్కృతిలోని భక్తి తత్వం, విగ్రహారాధన వంటివి ఆధ్యాత్మికతతో ఏమాత్రం విభేదించటంలేదు. నిజానికి ఈ తరహా సంస్కృతియే ఆధ్యాత్మికతను సముపార్జించటంలో దోహదపడుతుంది. యోగాభ్యాసాలను కూడా ఈ విధమైన సంస్కృతి నుండి వేరు చేయవద్దు. అంత మాత్రాన యోగా శిక్షణలో భక్తి తత్వాన్ని చొప్పించమని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు. భక్తి కూడా ఒక విధమైన యోగా అని తెలుసుకోండి. దీనిని తెలియజెప్పటం ద్వారా యోగా సిధ్ధాంతాలు మన సంస్కృతిని నిలబెట్టేందుకు సహాయపడగలవు.

 5. rathnamsjcc said,

  డిసెంబర్ 3, 2011 వద్ద 6:15 ఉద.

  మనసు నిలుపకున్న ముక్తి లేదయా చూపు నిలుపకున్న సుఖము లేదుబ్రహ్మ మనగ వేరె పరదేశమున లేడు బ్రహ్మ మనగ జూడు బట్ట బయలు, తనకు తానె తారక బ్రహ్మo
  హృదయమే మనసుకి మూలస్ధానం. ఇది మనసుయొక్క పరమ కేంద్రం. దీనిని చూడటానికి ప్రయత్నించక అది నీవై ఉండనేర్చుకో.నిన్ను నీవు తెలుసుకో. నీ నిజస్ధితి ,
  ఈ ఆత్మకు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ సూక్ష్మచైతన్య స్ధితి
  మదిని నిగ్రహించుట మనసు నిలిపి తన సాధనాబలం చేత దాటిన జ్ఞాని మాత్రం మనసు నిలిపి నిశ్చల స్థితిని పొంది మనసు నిలిపి లగ్నమై ఉంటుంది.

 6. rathnamsjcc said,

  మార్చి 29, 2012 వద్ద 9:57 ఉద.

  ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు మనస్సు ” మూలం. మనస్సు కనుక
  మనస్సు ” మూలం. కనుక మానవుడు ముందుగా ఆత్మ “జ్ఞానం” సంపాదించాలి..మనస్సు నిలవటం లేదని చాలామంది చెబుతుండటం జరుగుతుంటుంది. ఇది కూడా యదార్థమే. నిశ్చలతత్త్వమెట్లు కలుగుతుంది?

  మానవుడు తన జన్మను సార్థకం చేసుకోవాలి జీవిత పరమార్ధాన్ని సాధించిన మానవుడే మహాత్ముడైన భగవంతుడి రూపం. లేదు అనుభవం కూడా సత్యమైనదే. అది ఆత్మమే అనుభవం

  ఆత్మసత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి … సూక్ష్మచైతన్యం.సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఈ .సమాధి..
  ఆత్మకు ఆత్మయే గురువని, తన ఆత్మ సూచించే .సన్మార్గాన్ని అనుసరిస్తే ముక్తిని పొందవచ్చన్నాడు
  అనుభవపూర్వకంగ గ్రహించాల్సిం చూడ చూడ కలుగును సూక్ష్మ చైతన్య.సాధన ద్వారా ముక్తి

  మనస్సు ఎక్కడ నుంచి మనస్సు రాలేదు అది ఆత్మ యే ఆత్మఅతీతమైనది ఏకతత్త్వాన్ని గుర్తించినవాడు నిత్య సత్య జ్ఞానమర్గాన్నిగ్రహించాలి.

  మనస్సు ” మూలం. మనస్సు లగ్నం చేయు, కార్యాచరణకు జన్మలనుండి వస్తున్న వాసనలు, రాగద్వేషాలు, కామక్రోధాలు మొదలగునవి తొలగించుకోవడానికే సాధన. ఇవన్నీ తొలగితేనే మనస్సు శుద్ధి అవుతుంది. మనస్సు పరిశుద్దమౌతేనే ఆత్మజ్ఞానం అలవడుతుంది. అందుకే మనోశుద్ధికి సాధన
  జనకుడు జ్ఞాని ఎలా అయ్యాడు? భగవత్‌ సాక్షాత్కారంఆత్మ సాక్షాత్కారం పొందిన వారికి చూసేది ,చూడ బడేది తన లోనే లీనం అవుతుంది
  జనకమహారాజా డు నా దృష్టి మాత్రం ఎల్లవేళలా పరబ్రహ్మతత్త్వం పైనే లగ్నమై ఉంటుంది. విశేషధ్యానంతోనే నాస్థితిని సాధించాను. నేనీ ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి అతీతంగా ఉండగలను. నా మనస్థితి ఎటువంటిదో ఇప్పుడైనా అర్థమైందా
  ధ్యానంతో పరమసత్యాన్ని తెలుసుకో. ప్రపంచానికి అతీతంగా ఉంటూనే ప్రపంచ క్షేమం కోసం పనిచెయ్యి. ఇక వెళ్ళు!. సాధువుకు జనకుని ఔన్నత్యం, తన అల్పత్వం అర్థమయ్యాయి. అతనికి శిరసు వంచి నమస్కరించి అక్కడినుంచి నిష్క్రమించాడు
  జనకమహారాజా మనసు స్థిరపడుతుంది. మనస్సు స్థిరపడి నిగ్రహాన్ని పొందితేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం పొందినప్పుడే ఓ మనిషి తనని తాను తెలుసుకుంటాడు. తనని తాను తెలుసుకోవడమంటేనే దైవం గురించి తెలుసుకోవడమన్నమాట.

  జనకమహారాజా మనస్సు ప్రపంచం చుట్టూ పరిభ్రమిస్తుం టుంది, అలా చేసే జపమేల, దాని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని. ఆయన భక్త సమాజానికి అంతటికీ ఇచ్చిన సందేశం అమోఘమైనది.

  ఎంతో ఆడంబరంగా పెద్ద ఎత్తున భీజాక్షరాలను, మంత్రాలను వల్లెవేస్తూ చేసే చిత్తశుద్ధి లేని పూజలు వ్యర్థం. మీరు పూజించేది ఏ దేవుడినైనా లేదా దేవతనైనా సరే. ఎటువంటి మంత్రోచ్ఛారణతో నిమిత్తం లేకుండా చిత్త శుద్ధితో స్థిరమైన మనస్సులో ఆయా దేవతలను కేవలం అయిదు నిముషాలు అంటే మూడువందల సెకన్లు ఏకాగ్రతతో ధ్యానించినట్లయితే కేవలం ఒక్క సెకనుపాటు మీ మస్తిష్కంలో ఆయా దేవతా స్వరూపం గోచరించినట్లయితే అదే భగవత్‌ సాక్షాత్కారమని గుర్తించండి. అచంచలమైన భక్తితో ఏకాగ్రతతో భగవంతున్ని ధ్యానించడం వల్ల భగవత్‌ సాక్షాత్కారం పొందటం అందరికీ సాధ్యమే.

  అలాకాకుండా చిత్తశుద్ధి, అచంచ లమైన భక్తి లేకుండా లోకం కోసం వేషం వేస్తూ, రోమాంఛితం కలిగేలా తప్పెట్లు, తాళాలు మ్రోగిస్తూ ఎంతో ఆడంబరంగా, పెద్దపెట్టున మంత్రాలను వల్లెవేస్తూ… భగవత్‌ ఆరాధనలో మునిగితేలుతున్నాం అనుకునే వాడు భక్తుడు కాలేడు. అయినప్పటికీ భగవం తుని ఆరాధించే భకాగ్రేసరుల్లో మేమే ప్రథములం అని భావించే భక్తాగ్రేసరులు వారి జీవిత కాలం గడిచిపోయినా భగవంతుడి కృపకు పాత్రులు కాలేరు. భగవత్‌ సాక్షాత్కారాన్ని పొందలేరు, మోక్షాన్నీ సాధించ లేరు. కూప స్తమండూకాల వలె జీవన చక్రభ్రమణంలో సంచరిస్తూనే ఉంటారు.
  జనకమహారాజా మనస్సు ఎటువైపుకి ప్రయాణిస్తే ఇంద్రియాలన్ని అటువైపున ప్రయాణిస్తూ ఉంటాయి. కాబట్టి మన మనస్సులను ఎల్లప్పుడూ భగవంతునిపై లగ్నం చేస్తే… ఇంద్రియాలు కూడా భగవంతునివైపే ఉంటాయని యొక్క భావం.
  పరమాత్మ ప్రత్యక్షమయినప్పుడు తనను తాను మరచి భగవంతున్ని చూస్తూ ఉండిపోతాడు మనిషి. ఒకవేళ పరమాత్మ గురించి ఆలోచించడం మానేసి తన గురించి తాను ఆలోచిస్తూ ఉంటే భగవంతుడిని చూడలేరు. కాబట్టి, మానవులు భగవంతుని గురించి, తన గురించి ఒకేసారి తెలుసుకోలేరు

  మరణ సమయంలో కఫం నోటికి అడ్డుపడి మాటను రానీయదు. కనులు మూతపడిపోతూ ఉంటాయి. జ్ఞానం తగ్గిపోతూ ఉంటుంది. ఈ లోకాన్నే గుర్తించలేని స్థితిలో ఉండి పరమాత్ముడవైన నిన్ను వెదుకుట సాధ్యంకాదు. కనుక శరీరంలో శక్తి ఉన్నప్పుడే భగవంతుని ధ్యానించి పరమాత్మను చేరాలని చెబుతున్నాడు వేమన మహాకవి.

  మంచి బుద్ధి గలవాడా! శ్రీరాముని దయవల్ల నిశ్చయంగా అందరు జనులూ మెచ్చుకునేటట్లుగా, నోట్లోంచి నీళ్లూరేటట్లు రసాలు పుట్టగా… నేను న్యాయాన్ని బోధించే నీతులను చెబుతాను అని అంటున్నాడు సుమతీ శతకకారుడు.

  ఆత్మ సాక్షాత్కారం పొందిన వారికి చూసేది ,చూడ బడేది తన లోనే లీనం అవుతుంది ఈ సత్యాన్ని గ్రహించి ప్రతి మానవుడు సత్ ప్రవర్తనతో నడుచుకోవాలని భగవద్గీత సూచిస్తోంది. అన్నమయ్య స్వామి

  సకల జీవులు నారాయణ స్వరూపులై కనిపిస్తారు. శరీరంలోని అంతర్గత చైతన్యాన్ని గుర్తించిన సాధకులకు మాత్రమే ఈ పరమార్ధం అని భావం లోనికి వస్తుంది. ఆ చైతన్యం పట్ల అవగాహన లేని వారి శరీరం కేవలం ఒక తిత్తిగా మిగులుతుంది.
  చిత్తమంతా శ్రీ వేంకటేశ్వరుని దివ్య మంగళమూర్తి వెలుగుతూ ఉన్నప్పుడు సర్వమూ విష్ణుమయంగా గోచరిస్తుంది. సమాజంలోని ప్రతి వ్యక్తి అంతర్ముఖ సంస్కారాన్ని పెంపొందించుకొని పరమాత్మ తత్త్వం తెలుసుకున్నప్పుడే ఆ సమాజం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. అటువంటి సంస్కారాన్ని సముపార్జించుకోవడానికి కావలసిన పుష్కల సామాగ్రి అన్నమయ్య కీర్తనలలో ఉంది.
  ఈ చరాచర ప్రకృతి లోని అణువణువులోనూ పరమాత్మ యైన వేంకటపతిని దర్శించిన యోగిపుంగవుడు. తన పదునారవ ఏటనే శ్రీవేంకటేశ్వర స్వామి వారి సగుణ సాక్షాత్కారం పొందిన భాగవతోత్తముడు. “కంటి నఖిలాండ పతి, కీర్తనాధిపుని గంటి, కంటి నఘములు వేడుకొంటి” వంటి సంకీర్తనలలో అన్నమయ్య తాను అనుభవించిన సాక్షాత్కార దివ్యానుభూతిని వర్ణించినాడు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీనివాసుడి అనంత చైతన్య తత్త్వాన్ని అణువణువులో ఎలా దర్శించాలో ఈ క్రింది కీర్తనలో అన్నమయ్య చక్కగా అభివర్ణించాడు. “ఎదుట ఎవ్వరూ లేరు. ఇంతా విష్ణుమయము

  ప్రపంచం లో అనేక అరిష్టాలకు ,రోగాలకు ,అకాల మృత్యువుకు మానవుని లోని ,దుష్ట సంకల్పమే కారణం .చెడు ఆలోచన భావాల వల్లే వ్యాధి జనిస్తుంది .మురికి దగ్గరే కదా దోమలు చేరేది ?సద్భావన కల వారు ఎప్పుడూ ,ఆనందాన్ని ,ప్రశాంత త ను పొందు తారు .అంతే కాదు దూరం గా వున్న వారికి కూడా ,వాటిని పంచిస్తారు .చెడ్డ ఆలోచన వల్ల తనకే కాదు ,సంఘానికీ కీడు జరుగు తుంది .ప్రపంచమే దుష్ప్రభావానికి లోను అవుతుంది .కనుకదాన్ని దూరం చేసి కోవటానికి వెంటనే ,మంచిఆలోచన తెచ్చు కోవాలి .లేక పొతే ,సంఘమే ప్రమాద భరితం అవుతుంది .ఈ శరీరం తో పరమాత్మను చేర లేము .ఈ శరీరం లోని జీవాత్మను ,మన సాధన వల్లనే పరమాత్మలో లయం చేయ గలం

  అంతే కాదు పరమాత్మ ఇలా అంటాడు ”సుఖ ,దుఖాలు నీకు చెందినవి కావు .నీ మనస్సుకు చెందినవి .నీవుకర్తవే కాని ఫలం అనుభవించే వాడివి కావు .ఎప్పుడూ నువ్వు స్వతంత్రుడవే ”.దీనికి ఉదాహరణ గా ఒక కధ తెలుసు కొందాం
  ఒకప్పుడు వామ దేవ మహర్షి తల్లి గర్భం లో వుండగా ,తల్లి తో ఇలా అన్నాడు ”తల్లీ !నేను పారి పోతానేమో నని ,ఇనుప ఇళ్ళ వంటి దేహాలు అనేకం నన్ను బంధించాయి .కాని బంధింప బడిన పక్షి ,ఎలా గైతే గూటి కింద సొరంగాన్ని తొలిచి ,బయటకు పారి పోతుందో ,అట్లాగే నేను ,ఆత్మ జ్ఞానం తో ,బంధాలన్నీ ,తొలగించు కోని ,బయట పడతాను .”వామ దేవ మహర్షి మహా జ్ఞాని .ఆయన విజ్ఞానం ,జన్మ జన్మ కు వృద్ధి చెందింది .అందుకనే ,అంత వివేక వంతం గా పలికాడు .చివరి సారిగా ,తల్లి గర్భం లోంచి ,భూమి మీద పడక ముందే ,ఆత్మ సాక్షాత్కారం పొందాడు ,ఆత్మ జ్ఞాని .కనుక . ఆంటే సాధన ,శిక్షణ ,ఫలితం ఎన్నటికీ నశించదు .తగిన సమయం లో ఫలిస్తుంది .అందుకే నిర్విచారంగా ,ప్రతి క్షణం సాధన చేయాలి

  సాధనస్య ,సంస్కారా అను వర్తన్తే –కాలేచ ఫలా వంతో ,భవంతి ,-తస్మాన్ మాశుచః -ప్రత్యహం ,సాధన వ్యగ్రో భవ ”
  మంత్రాలు దాదాపు ఏడు కోట్లవరకు వున్నాయి .అన్నీ పరమాత్మను దర్శించ టానికి ఉపయోగ పడేవే .అయితె ”అహం బ్రహ్మాస్మి ”అనే మంత్రం వీటన్నిటిలో ఉత్కృష్ట మైనది .ఈ మంత్రోచ్చాటన ఎప్పుడు చేస్తూ ,జప ద్యానాదులతో మోక్షం పొంద వచ్చు .
  అన్నీ పరమాత్మను దర్శించ టానికి ఉపయోగ పడేవే .అయితె ”అహం బ్రహ్మాస్మి ”అనే మంత్రం వీటన్నిటిలో ఉత్కృష్ట మైనది .ఈ మంత్రోచ్చాటన ఎప్పుడు చేస్తూ ,జప ద్యానాదులతో మోక్షం పొంద వచ్చు . విచార్య మానం ,ఆత్మనో వ్యతిరిక్తం ,న కించిత్ వస్త్రం ,కుండా ,మొదలైన వన్నీ ,మట్టి లో నుంచే లభిస్తాయని ,విచారణ వల్ల ఎలా తెలుసు కొంటామో ,అట్లాగే ”ప్రత్యగాత్మ ”నుండే ,ఈ లోకం అంతా,ఏర్పడిందని తెలుసు కోవాలి .మనమే ప్రతి దానికీ ,సాక్షీ భూతం .అందరి లో నుంచే చూస్తాం .”త్వం సర్వస్య సాక్షీ ,త్వం ,సర్వస్మిన్ ,ఎకో ,ద్రస్టాత ,త్వతః

  ఆత్మాను భూతి మాత్రమే నిజమైన సంతృ ప్తిని ఇస్తుంది. ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి దేనినైనా సాధించ డానికి శక్తి … సత్యశోధన చేస్తారు.
  నిజమైన సత్యం తన ప్రయత్నాలు పనిచెయ్యవు అని అనిపించినప్పుడు, భగవంతుడు ఈ లోకంలోకి జ్ఞానులని పంపిస్తుంటాడు

  బ్రహ్మజ్ఞానంకి ఈ ప్రపంచాము లేదు నిద్ర లేదు జపములేదు కష్టంములేదుఆశలేదు మనస్సులేదు నిశ్శబ్దములేదుసాధించడానికి సాధన లేదుయోగ లేదు మంత్రము లేదు నియమాలు లేదు కోరికలు లేదు కష్టంలేదు ఇంద్రియాలు లేదుసుఖ ,దుఖాలు లేదు బ్రహ్మ బ్ఞానం అంటే పరమాత్మ ఒక్కటే అనుభవము సత్యశోధన
  మనిషికి మనస్సుసాధించడానికి సాధన అవసరం. మనిషి కూడా దేవునికి, మరొక మనిషికి మధ్య రాలేడు. కేవలము జ్ఞాని, దైవజ్ఞానము పొందిన వారు మాత్రమే ఈ విషయములో సాయపడగలరు

 7. asuryudu said,

  జనవరి 19, 2013 వద్ద 6:27 సా.

  Good one


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: