మంచి పుస్తకం-భారత జాతికి నా హితవు(స్వామి వివేకానంద)

మంచి పుస్తకం శీర్షికతో మీకు నేను చదివిన వాటిలో కొన్ని మంచి పుస్తకాలను,ఆయా పుస్తకాలు దొరికే ప్రదేశాలను మరియు కొన్ని మంచి పుస్తక ప్రచురణ సంస్థలను పరిచయం చేద్దామనుకుంటున్నాను.

సాధారణంగా పత్రికలలో వచ్చే సమీక్షలు మార్కెట్లో కొత్తగా విడుదలైన పుస్తకాలకే రాస్తారు. అది కూడా విడుదలైన ప్రతి పుస్తకానికీ రాస్తారు. మనం వాటిలోనుండి చదువదగ్గ దానిని, బాగున్నదానిని ఎంచుకోవటం కష్టం. అందుకే నేను ఈ శీర్షిక పుస్తక ప్రియులకు ఉపయుక్తంగా ఉంటుందని వ్రాస్తున్నాను. అలాగే మీ అభిప్రాయాలతో పాటు మీరు చదివిన మంచి పుస్తకాలను కూడా సూచించగలరు.

ముందుగా వివేకానందుని బోధనల సంగ్రహ సంకలనమైన భారత జాతికి నా హితవు అనే పుస్తకం గురించి పరిచయం చేస్తాను. దీనిని రామకృష్ణ మఠం వారు ప్రచురించారు. ఈ పుస్తకం మన జేబులో పెట్టుకోదగిన పరిమాణంలోనే ఉంటుంది. ఇది ఆంగ్ల భాషలోని ‘స్వామి వివేకానంద-హిజ్ కాల్ టు ద నేషన్ ‘ అనే చిరు గ్రంథానికి అనువాదం.  అసలు వివేకానందుని బోధనలున్న పుస్తకమేదైనా యువకులను ఎంతగా ఆకట్టుకుంటుందో, వారిని ఎంతగా ఉత్తేజితులను చేస్తుందో అందరికీ తెలుసు. ఐతే వాటన్నింటిలో కూడ ఈ పుస్తకం ఎన్నదగినది. ఈ చిరు గ్రంథం ఆ మహానుభావుడు బోధించిన అనేకానేక విషయాలలో ఏదో ఒక ప్రత్యేక విషయానికి సంబంధించినదిగా కాక దాదాపు ఆయన బోధనలన్నింటినీ సంగ్రహంగా తెలియచేస్తుంది. ఆయన జీవిత కథ కూడా ఇందులో పొందుపరచబడి ఉన్నది. ఈ పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందినది. ఎందరో యువకులు మరియు పెద్దలు ఈ పుస్తకాన్ని తమకు తెలిసిన వారికి బహుమతిగా ఇస్తుంటారు. అందుకొరకే రామకృష్ణ మఠం వారు ఈ పుస్తకాన్ని సబ్సిడీ ధరతో మూడు రూపాయలకే అందిస్తున్నారు. దీనిని పదుల సంఖ్యలో పంచే వారు ఎందరో ఉన్నారు. రామకృష్ణ మఠం వారి విక్రయశాలలలో మరియు విశాలాంధ్ర లాంటి ప్రఖ్యాత బుక్ స్టాల్స్ లో ఈపుస్తకం లభ్యమౌతుంది.

ప్రకటనలు

3 వ్యాఖ్యలు

 1. krishna prasad k. said,

  సెప్టెంబర్ 30, 2011 వద్ద 2:40 సా.

  “MANCH PUSTHAKAM – BHARATHA JATHIKI NA HITHAVU” CHADIVANU. THANKYOU. NAAKU NACHINA OKA MANCHI PUSTHAKAM GURINCHI MEERU RASINANDUKU. E PUSTHAKAM ENATI UVATHAKU MANCHI MARGANNI SUCHISTHUNDI. E PUSTHAKAMNU KONNI VANDALA COPIES KONI PILLALAKU PANCHI PETTANU. NA KUTHURU PUTTINA ROJU SANDHARBAMGA MANCHI PUSTHAKALU PILLALAKU PANCHI PETTADAM NAKU ALAVATU. NENU PANCHI PETTE PUSTHAKALALO E PUSTHAKAM KUDA OKATI. MEDWARA MARIKONNI PUSTHAKALU TELUSUKOVALANI KORUKONTUNNANU. NAKU NACHINA MAROKA PUSTHAKAM “MITTURODI KATHALU”. RACHANA “NAMINI SUBRAMANYAM NAIDU”.

 2. Jeevan said,

  డిసెంబర్ 30, 2011 వద్ద 1:48 సా.

  ee book naaku kaavaali… ekkada dorukuthundho chebuthaaraa ?

 3. saraswathikumar said,

  డిసెంబర్ 31, 2011 వద్ద 11:17 ఉద.

  @జీవన్: ఈ పుస్తకం కొద్ది కాలం నుండి మార్కెట్లో లభ్యం కావడం లేదు. అయితే త్వరలో పునర్ముద్రితం కావచ్చు. మీరెక్కడ ఉంటారో తెలియజేయలేదు. మన రాష్ట్రంలో హైదరాబాదు లోని దోమలగూడలో, వైజాగ్ R.K.Beachలో మరలా రాజమండ్రిలో (ఏరియా తెలియదు) రామకృష్ణ మఠాలున్నాయి. అక్కడ వీరి పుస్తక విక్రయశాల ఉంటుంది. విజయవాడ సికింద్రాబాదు లాంటి పెద్ద రైల్వేష్టేషన్ ప్లాట్‌ఫారాలమీద, తిరుపతిలాంటి పుణ్య క్షేత్రాలలో వీరి విక్రయశాలలున్నాయి. ప్రతి సంవత్సరం జనవరి నెలలో విజయవాడలో జరిగే పుస్తక మహోత్సవంలో వీరి స్టాల్ తప్పనిసరిగా ఉంటుంది. మీకు అవకాశమున్నచోట విచారించి ఆ పుస్తకం ఎప్పుడు అందుబాటులోకొస్తుందో తెలుసుకోండి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: